గ్రామీణ ప్రాంతాల్లోనూ 25 రోజులకే గ్యాస్ రీఫిల్ బుకింగ్ ..కేంద్రం కీలక నిర్ణయం

గ్రామీణ ప్రాంతాల్లోనూ 25 రోజులకే గ్యాస్ రీఫిల్ బుకింగ్ ..కేంద్రం కీలక నిర్ణయం
  • . వెంటనే అమల్లోకి

హైదరాబాద్, వెలుగు: దేశంలోని గ్రామీణ ప్రాంతాల వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లోనూ 25 రోజులకే ఎల్‌పీజీ సిలిండర్ రీఫిల్ బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి సోమవారం వెల్లడించారు. ఈ మేరకు వెంటనే మార్పులు చేయాలని ప్రభుత్వ రంగ పెట్రోలియం సంస్థలైన ఐఓసీఎల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌లను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా హార్మూజ్ జలసంధి వద్ద షిప్‌ల రాకపోకలకు ఆటంకం ఏర్పడి, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎల్‌పీజీ సరఫరాపై ఒత్తిడి పడింది. ఆ సమయంలో డిమాండ్‌ను నియంత్రించేందుకు పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజుల గడువు నిబంధనను తెచ్చారు. ప్రస్తుతం ఇంధన సరఫరా మెరుగుపడడంతో ఆ వ్యత్యాసాన్ని తొలగించి, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల వినియోగదారులకు 25 రోజుల  నిబంధనను అమల్లోకి తెచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.